హైదరాబాద్ లో యువతీ ఫై గ్యాంగ్ రేప్..

హైదరాబాద్ లో యువతీ ఫై గ్యాంగ్ రేప్..

హైదరాబాద్ లో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓ పక్క పోలీసులు 24 గంటలు నిఘా పెట్టినప్పటికీ , ఎక్కడో ఓ చోట మాత్రం అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా 25 ఏళ్ల యువతీ ఫై ముగ్గురు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన రాజేంద్ర నగర్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో.. 25 ఏళ్ల ఓ యువతిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. పీకలదాకా తాగిన ఆ ముగ్గురు యువకులు… బాధిత యువతికి తమ ఆటో లిఫ్ట్ ఇచ్చారు. అదే అదునుగా చేసుకొని…. అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేసారు. బాధిత యువతి కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.