రామోజీరావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు… కెటిఆర్‌

కరోనా పై పోరుకు మద్దతుగా నిలిచారు

ktr
ktr

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా పై పోరాటం చేసేందుకు ఈనాడు సంస్థల అధినేత రామోజిరావుకు విరాళం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో రామోజిరావుకు తెలంగాణ మంత్రి కేటిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్‌ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి … ముఖ్యమంత్రి సహయనిధికి 10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన శ్రీ రామోజీరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/