తెలంగాణ‌లో విద్యుత్ ఛార్జీలు పెంపు..కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్

హైదరాబాద్: తెలంగాణ‌లో విద్యుత్ ఛార్జీలు పెర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్ సీ ప్ర‌తిపాద‌నలు సిద్ధం చేయాల‌ని కేసీఆర్ తెలిపారు. అయితే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచ‌డానికి ముఖ్య కార‌ణం.. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌నే అని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రీన్ ఎన‌ర్జీ సెస్ ను భారీగా పెంచింద‌ని అన్నారు.

రూ. 50 ఉండే గ్రీన్ ఎన‌ర్జీ సెస్ రూ. 400 వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం పెంచింద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. దీంతో గ‌త ఏడేళ్ల నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం పై రూ. 7,200 కోట్ల భారం ప‌డుతుంద‌ట‌. అయితే త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్టు ప్ర‌క‌టించింది. పేద ప్ర‌జ‌ల‌పై భారం ప‌డ‌కుండా ఈ ఛార్జీల‌ను పెంచాల‌ని సూచించారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్ ల‌ను త్వ‌ర‌గా అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. కాగా సోలార్ పవ‌ర్ పై దృష్టి సారించాల‌ని కేసీఆర్ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/