సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం

corona virus
corona virus

సూర్యాపేట: పలు రాష్ట్రాలల్లో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఈక్రమంలోనే సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. కాసరబాద గ్రామానికి చెందిన 4 నెలల బాలుడు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో నేడు మృతి చెందాడు. మృతదేహాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే ఖననం చేసే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్‌తో పాటు బాలుడి గుండెకి హోల్‌ ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు బాలుడి కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌ చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/