జీపీఎస్ పద్ధతిలో క్వారంటైన్ ట్రాకింగ్

మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి

TS Minister Etala Rajender

Hyderabad: తెలంగాణలో క్వారంటైన్ లో ఉన్న వారందరినీ జీపీఎస్ పద్ధతిలో ట్రాకింగ్ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

ఈ రోజాయన చేసిన ఒక ట్వీట్ లో రాష్ట్రంలో దాదాపు పాతిక వేల మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని పేర్కొన్నారు.

వారందరినీ ఎప్పటికప్పుడు జీపీఎస్ పద్ధతి ద్వారా ట్రాక్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

కరోనా మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతున్నదని చెప్పారు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/