నేను ఆరోగ్యంగా ఉండటం ఎలా? ప్లీజ్ వివరించండి ..

మనస్విని: మానసిక, ఆరోగ్య సమస్యలకు పరిష్కార వేదిక

Anxiety, Depression
Anxiety, Depression

మేడం.. నా వయస్సు 60. ఈ మధ్యనే నాకు బిపి వచ్చింది.. నేను భయపడుతున్నాను . ఆందోళన చెందుతున్నాను అందువల్ల తరచూ తలనొప్పి వస్తోంది.. వత్తిడి కూడా ఎక్కువ ఉంది.. కుటుంబ సమస్యల వలన ఒత్తిడి ఎక్కువైంది. నాకు ఆరోగ్యంగా ఉండటం చాల ముఖ్యం.. లేకపోతే చాల ఆందోళనకు గురవుతాను.. అందువల్ల నేనుగా ఆరోగ్యంగా ఉండటం ఎలా? కొంచం వివరించండి ప్లీజ్ … శ్రావణి, హైదరాబాద్

మీరు మంచి ప్రశ్న అడిగారు.. ఆరోగ్యంగా ఉండాలనుకోవటం మంచి ఆలోచన.. ఆరోగ్యం గా ఉండటం మీ చేతుల్లోనే ఉంది.. మంచి ఆలోచనలతో, మంచి అనుభూతులతో ఆరోగ్యం బాగుంటుంది.. ప్రశాంతంగా ఉంటే మంచి ఆరోగ్యం మీసొంతం.. వ్యతిరేక ఆలోచనలతో..భయంతో వత్తిడితో , ఆదుర్ధాతో, ఆందోళనతో, ఆరోగ్యం పాడయిపోతుంది.. అందువల్ల మానసిక ప్రశాంతత ధైర్యం, సానుకూల ఆలోచనలు మంచి ఆరోగ్యానికి మూల కారణాలు.. జీవితం అపూర్వమైన కానుక.. అందువల్ల, పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.. ఆనందంగా, ప్రశాంతం గా ఉండాలి. వర్తమానంలో జీవించాలి.. ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రతిక్షణం ఆనందంగా గడపాలి.. ధైర్యమే మీకు రక్ష… మీ సానుకూల దృక్పధమే మీకు రక్ష.. మీరు భవిష్యత్తు గురించి ప్రయాణమే గమ్యం.. అందువల్ల జీవిత ప్రయాణాన్ని సంపూర్తిగా ఆస్వాదించాలి. ఆనందించాలి.. ఇది తప్పని సరి. .

ప్రతిరోజు పండుగలా జరుపుకోవాలని…

మేడం.. నా వయస్సు 60.. నాకు డిప్రెషన్ సమస్య వచ్చింది.. అంటే ఎల్లప్పుడు కుంగు బాటులో ఉండేది .కౌన్సిలింగ్ ద్వారా సమస్య పరిష్కారం అయింది.. 2 ఏళ్ళు బాగానే ఉన్నాను.. మరలా, అలాంటి సమస్య అంటే కుంగుబాటు వచ్చేలా ఉంది.. మా అమ్మాయి పెళ్లి అవటం లేదు.. ప్రేమ పెళ్లి అంటోంది.. అది మాకు ఇష్టం లేదు.. అందువల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయి.. దీనిని చూసిన నాకు మరలా కుంగుబాటు వస్తుందేమోనని భయంగా వుంది..నేను మానసిక ఆరోగ్యంతో ఉండాలంటే ఏంచేయాలో కొంచెం వివరించండి. ప్లీజ్.. -పూజిత (విజయవాడ )

మీ మానసిక ఆరోగ్యం మీచేతుల్లోనే ఉంది. ఇలాంటి సమస్యలు , కుటుంబ సభ్యులు సర్వసామాన్యమైనవి.. వాటిని తెలివిగా పరిష్కరించుకోవాలే తప్ప వాటికి తలవంచకూడదు.. సమస్యలు వస్తుంటాయి .. పోతుంటాయి.. అందువల్ల వాటి గురించి దిగులు పడవద్దు.. జీవితాన్ని ఆనందంగా గడపాలి. జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి.. ఆనందంగా ఉండటానికి అందువల్ల ప్రతి రోజూ పండుగలా జరుపుకోవాలి.. మీ అమ్మాయి పెళ్లి విషయం చర్చల ద్వారా , అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. అపుడు అన్నే బాగయిపోతాయి..

పెళ్లి సమస్యలు, పిల్లల సమస్యలు , చదువుల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్ధిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా అనీ సర్వసాధారణమైనవి.. అందువల్ల వాటిని అవగాహనతో , స్ఫష్టతతో పరిష్కరించుకోవాలే తప్ప, కుంగుబాటు చెందరాదు.. జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించాలి.

డాక్టర్ ఎం .శారద , సైకాలజీ ప్రొఫెసర్

‘స్వస్థ ‘ (ఆరోగ్య సలహాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/