నడుము నొప్పి ని తగ్గించేందుకు క్లాపింగ్ థెరపీ
ఆరోగ్యం- పరిరక్షణ
ఆటల్లో , పోటీల్లో మనవారిని ఉత్తేజ పరచటానికి చప్పట్లు కొడుతూ ఉంటాం. క్లాపింగ్ థెరపీ ని రోజూ ఒక పది నిముషాలు చేయటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట …

గుండె ఆరోగ్యానికి:
చప్పట్లు కొట్టటం వలన అర చేతులు వేడెక్కుతాయి… శరీరమంతా రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది.. ఇది గుండె కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. హృద్రోగాలు రాకుండా నివాసరిస్తుంది.. శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తుంది.
మానసిక ఆరోగ్యానికి:
మనం చప్పట్లు కొట్టేటప్పుడు ఉత్పన్నమయ్యే శక్తి మనసుకు సానుకూల సంకేతాలను పంపుతుంది. నరాల చంచలత్వం నుంచి బయట పడేస్తుంది. శరీరంలో సంతోషకర హార్మోన్లు ను విడుదల చేస్తుంది..
జ్ఞాపక శక్తికి: ఈ థెరపీని పెద్దలు మాత్రమే కాదు పిల్లలూ చేయవచ్చు.. చప్పట్లు కొట్టటం వలన పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
నడుము నొప్పికి:
నడుము నొప్పితో బాధ పడేవారికి ఈ థెరపీ మంచి ఉపశమనం కల్గిస్తుంది.. తుంటి కండరాలకు అనుసంధానంగా ఉన్న ఆక్యూప్రెజర్ పాయింట్లను ఉత్తేజం చేస్తుంది. నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.. ఎముక సంబంధిత సమస్యలూ తగ్గుతాయి..
ఎలా చేయాలంటే ..
పద్మాసనం లేదా వజ్రాసనం లో కూర్చోవాలి. రెండు చేతులను సమాంతరంగా చాచి చప్పట్లు కొట్టాలి. ఇలా ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం 20 నిముషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది..
జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/