ఉరుకుల పరుగుల జీవితం : అనారోగ్యం

చిన్న పొరపాట్లతో పెద్ద ఆరోగ్య సమస్యలు

ఉరుకుల పరుగుల జీవితంలో పడి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.. వీటితో జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గిపోవటం, మెదడు కణజాలం దెబ్బతినటం , అల్జీమర్ లాంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు.. కొన్ని అలవాట్ల వలన మెదడు, శరీరం రెండూ దెబ్బతినే ప్రమాదం వుంది.. మరి ఆ అలవాట్లు ఏంటో వాటిని ఎలా నియంత్రించుకోవాలో చూద్దాం ..

Busy Life-Little Mistakes in Diet

అల్పాహారం:

మనలో చాల మంది ఉదయం అల్పాహారం తినరు. ఇలా చేయటం వలన రక్తంలో చక్కర స్థాయిలు పడిపోతాయి.దాంతో మెదడుకు కావాల్సిన పోషకాలు అందవు… ఫలితంగా మెదడు అభివృద్ధి , అది చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి..

తీపి :

కొందరు తీపి పదార్ధాలు అతిగా తీసుకుంటారు.. అధికంగా తీపి తింటే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది.. ఊబకాయం, మధుమేహం, చర్మ సంబంధ , ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి..

శారీరక శ్రమ:

ఒకే చోట ఎక్కువ గంటలు కూర్చుని ఉండటం వలన మెదడు స్తబ్దుగా మారిపోతుంది.. ఒత్తిడి పెరుగుతుంది.. వీటిని ఆపాలనాటే రోజూ తప్పనిసరిగా ఓ అరగంట యోగ లేదా వ్యాయామం చేయాలి.. దీంతో మెదడు ప్రశాంతంగా , ఆరోగ్యంగా ఉంటుంది.. మెదడు కణాలు ఆరోగ్యంగా వున్నపుడు అది చక్కగా పనిచేస్తుంది..

నిద్రలేమి :

రాత్రి నిద్ర పోయాక మన శరీరం మరమ్మతులు చేసుకుంటుందని నిపుణులు చెబుతారు.. దీంతో తర్వాత రోజు మెదడు బాగా పనిచేస్తుంది.. ఆందోళనలు తగ్గుతాయి.. నిద్ర లేమితో వ్యక్తులు అలసిపోతారు..బలహీనపడి పోతారు.. రోజంతా నిరుత్సాహంగా వుంటారు.. చేసే పనిపై శ్రద్ధ పెట్టలేరు.. ఆంతే కాదు నిద్రలేమి వలన మెదడు, గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి.. కాబట్టి, రోజుకు ఏడెనిమిది గంటలు నిద్ర పోవాల్సిందే.

మరిన్ని ఆరోగ్య విషయాల కోసం (నాడి) క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/health1/