త్వరంలో మార్కెట్‌లోకి చేనేత మాస్కులు

చేనేత మాస్కుల్ని ప్రమోట్‌ చేస్తున్న కెటిఆర్‌

weavers-masks

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో బయట తిరగాలంటే మాస్కులు తప్పనిసరి అయింది. ఈసందర్భంగా చేనేత కార్మికులు మాస్కుల్ని తయారు చేస్తున్నారు. ఇవి రీయూజబుల్ మాస్కులు. అంటే ఈ మాస్కుల్ని ఎన్నిసార్లైనా ఉతికి వాడుకోవచ్చు. ధర కూడా చాలా తక్కువ డబుల్ లేయర్డ్ మాస్క్ ధర రూ.20 మాత్రమే. పోచంపల్లి ఇక్కత్, కలంకారి ఫ్యాబ్రిక్ మాస్క్ ధర రూ.40. . ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా సింగిల్ యూజ్ మాస్కులే లభిస్తున్నాయి. అంటే మాస్కును ఒకసారి మాత్రమే వాడిపారెయ్యాల్సి ఉంటుంది. రోజూ మాస్క్ ధరించాలి కాబట్టి సింగిల్ యూజ్ మాస్కులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే రీయూజబుల్ అంటే మళ్లీ వాడుకోవడానికి వీలుండే మాస్కులు అయితే రోజూ ఉతికి ఎక్కువ రోజులు ఉపయోగించొచ్చు. చేనేత మాస్కులు ధర కూడా తక్కువ కాబట్టి ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ చేనేత మాస్కుల్ని మంత్రి కెటిఆర్‌ ప్రమోట్ చేస్తున్నారు. భారతదేశంలోని చేనేత కార్మికులకు చేయూతగా నిలవాలని పిలుపునిచ్చారు.త్వరలో ఈ మాస్కులు అన్ని మార్కెట్లలో కూడా లభిస్తాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/