మెక్సికో, బ్రెజిల్‌లో కరోనా విలయతాండవం

మెక్సికోలో గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మృతి

corona virus
corona virus

మెక్సికో: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తుంది. ఈనేపథ్యంలో మెక్సికో, బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. మెక్సికోలో గడిచిన 24 గంటల్లో 1,092 మంది చనిపోయారు. బ్రెజిల్‌లో సైతం గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఒక్కరోజే 1,349 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 65 లక్షల 67 వేల 404 మంది కరోనా వైరస్‌ పాజిటివ్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షల 10 వేల 562. వ్యాధి నుంచి 31 లక్షల 68 వేల మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/