ట్రంప్ తో విందుకు తెలంగాణ సీఎం

25న ట్రంప్ కు గౌరవ విందును ఇవ్వనున్న రాష్ట్రపతి

trump-kcr
trump-kcr

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు 24న వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా ఈనెల 25న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవ విందును ఇవ్వనున్నారు. ఈ విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాష్ట్రపతి ఆహ్వానించారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కెసిఆర్ కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు 25వ తేదీన కేసీఆర్ ఢిల్లీకి పయనమవనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, హర్యాణా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/