శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం

శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం రేపింది. ఈ కాల్పుల వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ వ్యక్తి ఫై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. బాధితుడు ఘటనపై శామీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెలబ్రిటీ క్లబ్‌లోని విల్లాలోకి ప్రియుడితో కలిసి ఓ వివాహిత వచ్చింది. తన భార్య వేరే వ్యక్తితో వెళ్లిందని తెలుసుకున్న భర్త ఆ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లి చూడగా..ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో.. వారిద్దర్నీ సదరు భర్త నిలదీసాడు. వివాహిత తో ఉన్న సదరు వ్యక్తికి , ఆ మహిళా భర్త కు మధ్య గొడవ మొదలైంది.

దీంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో భర్తపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎయిర్‌ గన్‌తో కాల్పులు జరిపింది ఓ సీరియల్‌ నటుడని తెలుస్తోంది. పలు ప్రముఖ సీరియళ్లలో ఇతడు నటించినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.