హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీళ్లు బంద్

బుధవారం ఉ.6 నుంచి గురువారం సా. 6 వరకు

drinking-water-shutdown-for-36-hours-in-these-areas-of-hyderabad

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటికి అంతరాయం కలగనుంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటలకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఒకటో దశలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రధానా పైపులైన్ లీకేజీ మరమ్మతు పనుల నేపథ్యంలో సరఫరా నిలిచిపోనుందని వెల్లడించారు.

నగరంలోని పలు డివిజన్లలో పూర్తిగా, మరికొన్ని డివిజన్లలో పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం కలుగనుందని జలమండలి తెలిపింది. ఓ అండ్ ఎం డివిజన్లు అయిన కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి/అల్వాల్, ఉప్పల్, నాగారం/దమ్మాయిగూడ, కొంపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఎస్ఆర్‌‌నగర్, శేరిలింగంపల్లి, నిజాంపేట్‌ డివిజన్లలో పాక్షికంగా అంతరాయం కలుగనుంది.