వారాహి యాత్ర పూర్తి చేసినందుకు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన మంత్రి అంబటి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి విజయయాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది. ఉభయ గోదావరి జిల్లాలో మొదటి దశ యాత్ర చేపట్టిన పవన్..రెండో దశ యాత్రను జులై 09 నుండి ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాలలో పూర్తి చేసారు. మొదటి దశ యాత్రలో కంటే రెండో దశ యాత్రలో జగన్ సర్కార్ ఫై మరింత దూకుడు చూపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కోటిగా ప్రజలకు వివరిస్తూ రెచ్చిపోయారు. అలాగే వాలంటరీ వ్యవస్థ ఫై కూడా పలు ఆరోపణలు చేసి దుమారమే రేపారు.

ఈ యాత్ర ఫై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వారాహి యాత్ర పూర్తి చేసినందుకు ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు అన్నారు. పవన్ కళ్యాణ్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని, ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలని ఎద్దేవా చేశారు. పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయాడని ఆగ్రహించారు. మర్యాదలకు మారుపేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో పవన్‌ చాలా మర్యాదగా మాట్లాడారు.. మళ్లీ ఎప్పుడు వస్తారు ? అని ఫైర్‌ అయ్యారు. పవన్ కల్యాణ్‌ తన స్పీచ్ లో 373 సార్లు జగన్ పేరును ఉచ్చరించాడని , వెయ్యి సార్లు జగన్ పేరు ఉచ్చరించటం పూర్తి చేస్తే పవన్ పాపాలు కొన్ని అయినా కొట్టుకుపోతాయని అంబటి ఎద్దేవా చేసారు.

కాగా అంబటి కామెంట్స్ ఫై అదే స్థాయి లో జనసేన శ్రేణులు రిప్లయ్ ఇస్తున్నారు. పవన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పే ధైర్యం లేదని , ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించే మాట్లాడతారని , పవన్ చెప్పిన వాటికీ మాత్రం జవాబు ఇవ్వలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.