మూడు రిజర్వాయర్లకు సిఎం జగన్‌ శంకుస్థాపన

Virtual Laying Foundation Stone to 3 Reservoirs in Raptadu Constituency by Hon’ble CM of AP

అనంతపురం: సిఎం జగన్‌ రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లకు వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిరజర్వాయర్ల పనులను సిఎం జగన్‌ ప్రారంభించారు. అంతనరం సిఎం మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్లు, హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటి తరలించనున్నట్లు తెలిపారు. దాంతో 7 మండలాల్లోని 35 గ్రామాలకు మేలు జరుగుతోందన్నారు. రిజర్వాయర్లు, ప్రధాన కాల్వల కోసం రూ. 800 కోట్లు విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/