రెండవ గ్రీన్ ఫంగస్ కేసు నమోదు

జలంధర్ లో గుర్తించిన అధికారులు

Green Fungus Case
Green Fungus Case

Jalandhar : దేశంలో రెండవ గ్రీన్‌ ఫంగస్‌ కేసును గుర్తించారు. ఇదిలావుండగా, మూడు రోజుల కిందట ఇండోర్‌లోని శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో మొదటి కేసును గుర్తించారు. ఇపుడు జలంధర్‌లో రెండో కేసుతో వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌ లో ఇప్పుడిప్పుడే పాజిటివ్‌ కేసులు తగ్గుతున్న క్రమంలోనే గ్రీన్‌ ఫంగస్‌ కేసు నమోదవడంపై ఆందోళన మొదలైంది. హాస్పిటల్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ గ్రేస్‌ మాట్లాడుతూ మార్చిలో రోగికి కరోనా నిర్ధారణ అయ్యిందని, కోలుకున్నాడని తెలిపారు. కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఈ నెల 14న ఆసుపత్రికి తీసుకువచ్చారని , వైధ్యులు పరీక్షలు చేసి.. ఊపిరితిత్తుల్లో ఫంగస్‌ను గుర్తించారని, నమూనాలు సేకరించి ప్రైవేటు ల్యాబ్‌కు పంపగా.. శనివారం వచ్చిన నివేదికల్లో గ్రీన్‌ ఫంగస్‌గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతుందని చెప్పారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/