ఫోన్ లో బండి సంజయ్ కి అభినందనలు తెలిపిన మోడీ

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. శనివారం తుక్కుగూడ లో జరిగిన బిజెపి భారీ బహిరంగ సభ సక్సెస్ కావడం తో బిజెపి నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో మోడీ ..సంజయ్ కి ఫోన్ చేసి శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారని కితాబు ఇచ్చినట్లు తెలుస్తుంది. పాదయాత్ర చేసిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలపాలని బండి సంజయ్ కి ప్రధాని మోదీ సూచించారు

మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టానని.. రెండు విడతల్లో కలిపి 770 కి.మీలు నడిచాను’’ అని మోదీకి తెలిపారు బండి సంజయ్. నడిచేది నేనయిన నడిపించేది మీరని అన్నారు. పాదయాత్రలో ప్రజలు ఏం అంటున్నారని… బండి సంజయ్ ని ప్రధాని మోదీ ప్రశ్నించారు. దీనికి కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కేంద్ర పథకాలు అమలు చేయకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ప్రధానికి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఇక ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా…… ఆయన జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు.