నన్ను మించిన పర్యావరణవేత్త మరోకరు లేరు

ఎన్నికల స్టంట్ అంటున్న విమర్శకులు

Trump

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇప్పటికాలంలో తనను మించిన పర్యావరణవేత్త మరొకరు లేరని స్వయంగా అభివర్ణించుకున్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు థియొడర్ రూజ్ వెల్ట్ గొప్ప పర్యావరణవేత్తగా గుర్తింపు పొందారని, ఆయన తర్వాత మళ్లీ అంతటి పేరు తనకే వచ్చిందని కొందరు సెనేటర్లు తనతో అన్నారని ట్రంప్ వెల్లడించారు. అయితే, ట్రంప్ విమర్శకులు మాత్రం ఇది ఎన్నికల కోసం వేస్తున్న ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. పర్యావరణవేత్త అయితే పారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఎందుకు బయటికి వచ్చినట్టు అని ప్రశ్నించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/