అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సోము వీర్రాజు

అంతర్వేదిలో అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి

Somu veerraju

రాజమండ్రి: ఏపి బిజెపి చీఫ్‌ సోము వీర్రాజు అంతర్వేది రథం దగ్ధం ఘటనపై రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న యువకులు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారని, ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నిస్తే నినాదాలు చేశారన్న సమాధానం వచ్చిందని తెలిపారు. నినాదాలు చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. ఓవైపు రథం కాలిపోయి హిందువుల హృదయాలు గాయడిపతే… నినాదాలతో రెచ్చగొడుతున్నారని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరు రెచ్చగొడుతున్నారు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏపిలో జరుగుతున్నాయో లేదో ప్రభుత్వమే తేల్చుకోవాలి’ అంటూ స్పష్టం చేశారు. నిన్న అంతర్వేదిలో అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, అర్ధరాత్రి నుంచి గృహనిర్బంధంలో ఉంచిన బిజెపి నేతలను వెంటనే విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/