అక్టోబర్‌ చివరి నాటికి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తా

Omar Abdullah

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని గుప్కర్ రోడ్‌లో తనకు కల్పించిన ప్రభుత్వ వసతి గృహన్ని అక్టోబర్‌ చివరి నాటికి ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తాను స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయమన తెలిపిరు. ఈమేరకు ఆయన జమ్మూ కశ్మీర్‌ అడ్మిస్ట్రేషన్‌కు ఆయన లేఖ కూడా రాశారు.

‘జమ్మూకశ్మీర్‌ పరిపాలనకు నా లేఖ. నేను శ్రీనగర్‌లోని నా ప్రభుత్వ వసతిని అక్టోబర్ చివరికి ముందే ఖాళీ చేస్తాను. నేను మీకు తెలియజేయాలనుకుంటుంది ఏమిటంటే నేను తగిన వసతి కోసం అన్వేషణ ప్రారంభించాను. అయితే కరోనా కారణంగా ఆ ప్రక్రియకు ఆలస్యమైంది. అన్ని విధాల సౌకర్వవంతమైన ఇంటి కోసం చుస్తున్నాను. త్వరలో ఇళ్లు దొరకగానే గుప్కర్ ప్రభుత్వ వసతిని ఖాళీ చేస్తాను. దీనికి నాకు 8 నుంచి 10 వారాల సమయం పట్టోచ్చు. అప్పటి వరకు నాకు సమయం ఇవ్వాలని విజ‍్క్షప్తి’ అంటూ జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాన్ని ఆయన విజ‍్క్షప్తి చేశారు. అంతేగాక ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని లేఖలో తెలిపారు.

కాగా గతేడాది ప్రభుత్వ వసతి గృహంలో ఆయన అక్రమంగా ఉంటున్నారని వెంటనే దానిని ఖాళీ చేసి ప్రభుత్వానికి ఆయన అప్పగించాలని జమ్మూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/