చైనాలో మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు

తాజాగా, 101 కరోనా పాజిటివ్‌ కేసులు

China Coronavirus

బీజింగ్‌: కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో మళ్లీ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, 101 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ మధ్య నుంచి నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఆదేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. కొత్త కేసుల్లో 89 జిన్జియాంగ్‌లో నమోదయ్యాయి. స్వయంప్రతిపత్తిగల ఈ ప్రాంతంలో కొవిడ్‌ పరీక్షలను ఎక్కువ సంఖ్యలో చేస్తున్నారు. లియోనింగ్‌లో ఎనిమిది, బీజింగ్‌లో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. 27 మంది రోగులకు లక్షణాలు(అసింప్టోమాటిక్‌) లేవని గుర్తించారు. దీంతో చైనాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 84,060కి చేరుకుంది. ప్రస్తుతం 273 మంది అసింప్టోమాటిక్ రోగులు వైద్య పరిశీలనలో ఉన్నారు. మృతుల సంఖ్య 4,664 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/