ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం

అమరావతిః ఏపీలోని విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ప్రభుత్వం గెజిట్ జారీచేసింది. యూనివర్శిటీ డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ సెప్టెంబరు 21న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 19వ నెంబరుతో ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం మోదించింది. దీన్ని గవర్నర్‌కు పంపగా సోమవారం ఆమోదించారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు 1433 నెంబరుతో గెజిట్ విడుదల చేశారు. ఇక నుండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పిలవనున్నారు. అడ్మిషన్లు, కేంద్రానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్శిటీ పేరుమీదే నిర్వహించనున్నారు.
కాగా, గత రెండు నెలలక్రితం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పుపై బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్ష టిడిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు అసెంబ్లీ ఆమోదించడంతో గెజిట్ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గవర్నర్‌కు పంపగా రెండు నెలల అనంతరం పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/