పుష్ప నుండి సమంత సిజ్లింగ్ పోస్టర్ రిలీజ్

పుష్ప నుండి సమంత సిజ్లింగ్ పోస్టర్ రిలీజ్

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ లో సమంత ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సినిమాలో సమంతను ఎంత హాట్ గా చుపించారో..ఏ రేంజ్ లో స్టెప్స్ వేయించారో అని అంత ఎదురుచూస్తున్న క్రమంలో సమంత తాలూకా సిజ్లింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. త్వరలో ఈ ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ ని చూడటానికి సిద్ధంగా ఉండండని చిత్ర యూనిట్ ట్వీట్ చేసి సామ్ తాలూకా పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ స్పెషల్ నంబర్ లో బన్నీ – సామ్ స్టెప్పులు ప్రత్యేకంగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘పుష్ప’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ – సునీల్ – అనసూయ – ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.