బాస్ వస్తుండు..సౌండ్ పెంచుకో అంటున్న దేవి శ్రీ

మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ను రేపు సాయంత్రం మేకర్స్ విడుదల చేయబోతున్నారు. “వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ… బాస్ పార్టీ” అంటూ సాగే ఈ పాట ఎంతో హుషారు గా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక దేవి శ్రీ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గతంలో చిరంజీవి – దేవి కలయికలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. దీంతో ఈ మూవీ ఫై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక ఫస్ట్ సింగిల్ ఎలా ఉండబోతుందో దేవి చిన్న ప్రోమో ద్వారా తెలిపారు. “నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడి వేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో… బాస్ వస్తుండు, బాస్ వస్తుండు” అంటూ పక్కా మాస్ పదజాలాన్ని కురిపించడం ఈ ప్రోమో వీడియోలో చూడొచ్చు. మొత్తానికి ఇది టైటిల్ సాంగ్ అని అర్థమవుతోంది. ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియలతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆలపించారు. ఈ గీతానికి దేవిశ్రీనే సాహిత్యం అందించారు. ఈ పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మెగాస్టార్ సరసన తళుక్కుమన్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తుండగా , రవితేజ, కాథరిన్ ట్రెసా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

YouTube video