కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్య, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

అంతకుముందు కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తోనూ సీఎం జగన్‌ సమావేశం అయ్యారు. అరగంట పాటు కొనసాగిన ఈ భేటీలో.. ఏపీలో క్రీడా మైదనాల అభివృద్ధి సహా పలు అంశాలపై సీఎం జగన్‌ చర్చించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/