ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం రాబోయే సంక్రాంతి కి కాకుండా సమ్మర్ లో రిలీజ్ చేయబోతారనే వార్తలు అభిమానులను నిరాశకు గురి చేస్తుండగా..ఇప్పుడు మరో పాన్ చిత్రం కూడా విడుదల వాయిదా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘మ‌హాన‌టి’ ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె చిత్రం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.

ముందుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2024 సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాత అశ్వినీదత్‌ ప్రకటించాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ప్రాజెక్ట్‌-K’ చిత్రం మరో మూడు నెలలు పోస్ట్‌ పోన్‌ కానుంది. సై-ఫై జాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫ్యూచ‌ర్ గురించి ఉంటుంద‌ని, వ‌ర‌ల్డ్ వార్-3 టైమ్ లైన్‌లో ఈ సినిమా జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. కాగా వీఎఫ్‌ఎక్స్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందట. దాంతో చిత్రబృందం లేటైనా మంచి అవుట్ పుట్‌తో రావాలని నిర్ణయించుకుందట. ఈ క్రమంలో మరో మూడు నెలలు పోస్ట్‌ పోన్‌ చేస్తూ ఏప్రిల్‌ 10న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట.