అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తీపి కబురు

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తీపి కబురు అందించింది తెలంగాణ సర్కార్. గత కొద్దీ రోజులుగా అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. చేతికి వచ్చిన పంట నీళ్లపాలైందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ఇస్తామని ప్రకటించారు. ప్రకటించినట్లే సీఎం కేసీఆర్ వారికీ సాయాన్ని అందజేస్తున్నారు. ఈ నెల 12 నుంచే వాటిని పంపిణీ చేయనున్నారు.

రైతులకి ఎకరాకు పది వేల రూపాయల చొప్పున ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు బాధిత రైతులకు చెక్కులు ఇవ్వనున్నారు. వర్షాల వలన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయిన పంటల్ని సీఎం కేసీఆర్ పరిశీలించి ఆ తరవాతే భరోసా ఇచ్చారు. పంటతో సంబంధం లేకుండా ఎకరాకు రూ.10 వేల చొప్పున బాధిత రైతులందరికీ పరిహారం ఇస్తున్నట్టు హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.