అనసూయ – విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య ట్వీట్స్ వార్

మరోసారి అనసూయ ను విజయ్ దేవరకొండ అభిమానులు టార్గెట్ చేసారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ టైం లో అనసూయ ఎంత హడావిడి చేసిందో తెలియంది కాదు..ఈమె హడావిడి సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ ను అనసూయ టార్గెట్ చేసింది.

జబర్దస్త్ తో ఎంతో పాపులర్ అయినా అనసూయ..ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టింది. క్షణం, రంగస్థలం, పుష్ప ఇలా వరుస హిట్లతో దూసుకెళ్తోంది. కాగా తాజాగా అనసూయ చేసిన ట్వీట్ పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ నటించిన ఖుషి మూవీ పోస్టర్లో THE విజయ్ అని పేర్కొనడాన్ని ఉద్దేశించి అనసూయ…’ఇప్పుడే ఒకటి చూశాను… THE నా? బాబోయ్ పైత్యం… ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం’ అని ట్వీట్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తాజాగా అనసూయ ‘భలే రియాక్ట్ అయ్యారు. దొంగ… ఊప్స్…. బంగారు కొండలంతా నేను అనేది నిజమని నిరూపిస్తున్నారు’ అని ట్విట్ చేశారు.