బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌ లో లష్కరే ఉగ్రవాది హతం..

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు మే 06 శనివారం తెల్లవారుజామున కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదుల బృందంపై కాల్పులు జరపగా ఓ ఉగ్రవాది హతమయ్యాయడు. బారాముల్లాలో గత నాలుగు రోజులలో ఇది మూడో ఎన్‌కౌంటర్‌ కాగా ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఈరోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్మూలో పర్యటిస్తున్నారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.