డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం

సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. అనారోగ్య కారణంతో శనివారం రాత్రి చెన్నైలో ఆమె మృతి చెందారు. ‘నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది’అని సింగీతం సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.

సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకళ్యాణిని 1960లో పెళ్లి చేసుకున్నాడు. సింగీతం శ్రీనివాస్ సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. సినీ కెరీర్‌లో లక్ష్మీకళ్యాణి పాత్ర ఏంతో కీలకం.. సినిమా స్క్రిప్ట్ రాయడంలో ఆయనకు ఎంతో సహకరించింది. అయితే లక్ష్మీకళ్యాణి గురించి సింగీతం ‘శ్రీకళ్యాణీయం’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. సింగీతం విషయానికి వస్తే.. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ – ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి,పుష్పక విమానం,ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ప్రభాస్ నటించబోతున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కేలో కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నట్లు ఒప్పుకున్నారు. కానీ ఆయన అనారోగ్య పరిస్థితి వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు.