‘ఆపరేషన్ కావేరి’..సూడాన్ నుంచి మరో 231 మంది భారతీయులు

న్యూఢిల్లీః సుడాన్ దేశం నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో ఆ దేశంలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్నది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేరుస్తున్నది. సూడాన్‌పై పట్టు కోసం సైన్యం, పారా మిలిటరీ బలగాల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది. దాంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకొస్తున్నది. ముందుగా భారతీయులను సూడాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు చేరుస్తున్నది. ఇప్పటికే పలువురు స్వదేశానికి వచ్చేయగా తాజాగా మరో 231 మంది వాయు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నారు.