విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్

ప్రస్తుతం సామాన్యులు బ్రతికే రోజులు పోయాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు గగ్గులో పెడుతున్నారు. కూరగాయలు , బియ్యం , ఉప్పు , పప్పు, పెట్రోల్ , గ్యాస్ ఇలా ప్రతిదీ విపరీతంగా పెరిగిపోతుండటం తో సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలని వాపోతున్నారు. ఇదే క్రమంలో విద్యుత్ చార్జీలు సైతం మోతమోగిస్తున్నాయి. పలు చార్జీల పేరిట వినియోగదారుల నుండి భారీగా వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈఆర్సీ ఓ తీపి కబురు తెలిపి హమ్మయ్య అనిపించింది.

తెలంగాణ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్ ఆదయా వ్యయాల ప్రతిపాదనను ఈఆర్సీ ఆమోదించింది. విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వారికి భారం లేకుండా ఈఆర్సీ నిర్ణయించామని.. కస్టమర్ ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పెరుగుతున్న ధరలు సామాన్యులకు ఎంత ఇబ్బందిగా మారిందో అర్థమవుతుందని.. తెలంగాణ ప్రజలకు మేలు చేసే యోచనలో విద్యుత్ సంస్థ ఉందని.. ఈ నేపథ్యంలో కస్టమర్ ఛార్జీలలో మార్పు లేదని.. డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని.. సబ్సిడీ, ఇరిగేషన్ లతో పాలు పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సబ్సిడీని డిస్కలకు ఎలాంటి భారం పడకుండా ఐదేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని.. దీంతో విద్యుత్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలుగుతుంది’ అని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించారు.