షాక్ : నటుడు శ్రీకాంత్ మృతి..శోకసంద్రం లో ఇండస్ట్రీ

ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్ (82) కన్నుమూశారు. వయసు మీద పడడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి, దీంతో ఆయన బుధువారం కన్నుమూశారు. ఈయన మరణం పట్ల సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. భైరవి, సాధురంగం వంటి చిత్రాలలో కలిసి పనిచేసిన రజనీకాంత్ ప్రియమైన స్నేహితుడి మరణం చాలా బాధించిందని చెప్పాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.

దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ సైతం ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. కథానాయకుడు, విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన శ్రీకాంత్‌ని బరువైన హృదయంతో సాగనంపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్‌ తన చివరి ఇంటర్వ్యూలో.. రజనీకాంత్‌ని కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతడి ఆశ నెరవేరలేదు. అలాగే కోలీవుడ్ సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈయన కు సంతాపం తెలిపారు.