గుజరాత్ ప్రభుత్వ సీనియర్ అధికారి హితేష్ పాండ్యా రాజీనామా

Senior Gujarat Government Official Resigns Over Son’s Links With Conman

న్యూఢిల్లీః గుజరాత్ సీఎం కార్యాలయంలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(పీఆర్వో)గా విధులు నిర్వహిస్తోన్న హితేష్ పాండ్యా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల పీఎంఓ అధికారినంటూ కాశ్మీర్ లో పర్యటించిన నిందితుడు కిరణ్ బాయ్ పటేల్ బృందంలో తన కొడుకు అమిత్ పాండ్యా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తన కొడుకు చేసిన పనికి నైతిక బాధ్యత వహిస్తూ తాజాగా అతని తండ్రి హితేష్ పాండ్యా తన రాజీనామా పత్రాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు సమర్పించారు. మరోవైపు గుజరాత్ లోని బిజెపి సైతం అమిత్ పాండ్యాను పార్టీ సభ్యత్వం నుంచి సస్పండ్ చెసింది.

హితేష్ రాజీనామా పత్రాన్ని గనక పరిశీలించినట్టయితే తన కొడుకు అమాయకుడని, కానీ సీఎంఓ, పీఎంఓ ప్రతిష్టను దిగజార్చడం తనకు ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నానని హితేష్ పేర్కొన్నారు. 2001నుంచి హితేష్ గుజరాత్ ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అంతే కాకుండా అమిత్ పాండ్యా గుజరాత్ లోని నార్త్ జోన్ కు పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంఛార్జ్ గా ఉన్నారు. పీఎంఓ అధికారినని చెప్పుకుంటూ కిరణ్ నాలుగు నెలలుగా అనేక సౌకర్యాలు పొందాడు. అందులో భాగంగా అతనికి జడ్ – ప్లస్ సెక్యూరిటీ, ఫైవ్ స్టార్ హోటల్‌లో అధికారిక వసతిని కూడా కిరణ్ అనుభవించాడు.