గోవాలో తెరుచుకున్న పాఠశాలలు

పనాజీ : గోవాలో పాఠశాలలు పున: ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు తెరిచారు. ఒకటోవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా సంస్థలను ప్రారంభమైయ్యాయి. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని..కోవిడ్ రూల్స్ పాటిస్తూ భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.

కాగా, కరోనా కారణంగా గోవాలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులతో బోధన నిర్వహించేవారు. ఇప్పుడు గోవాలో కరోనా అదుపులోకి రావడంతో పాఠశాలలు పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/