ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు
అధికార లాంఛనాలతో మంత్రి మేకపాటి అంత్యక్రియలు

అమరావతి : ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) హఠాన్మరణం పట్ల ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. అధికార లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. సంతాప సూచకంగా జాతీయపతాకాన్ని అవనతం చేస్తారు.
కాగా, ఈ రోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, నేతల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఏపీలోని నెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి తీసుకెళ్తారు. అమెరికాలో ఉన్న గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి రేపు స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/