మలేషియా ఎయిర్‌పోర్టులో 150 మంది భారతీయ వైద్య విద్యార్థులు
కరోనా కేసులతో నగరం షట్ డౌన్

మలేషియా ఎయిర్‌పోర్టులో 150 మంది భారతీయ వైద్య విద్యార్థులు చిక్కుకున్నారు. విద్యార్థులు
ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్నారు.
ఫిలిప్పీన్స్‌లో రోజుకు 40 నుంచి 50 కరోనా కేసులు నమోదు అవుతుండడంతో అక్కడి ప్రభుత్వం నగరాన్ని షట్‌డౌన్ చేసింది. 72 గంటల్లో విద్యార్థులందరు తమ దేశాలకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు.
దీంతో భారతీయ విద్యార్థులు ఫిలిప్పీన్స్ నుంచి మలేషియాకు చేరుకున్నారు. భారత్ వచ్చేందుకు విద్యార్థులు టికెట్లు తీసుకున్నారు.
అంతలోనే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు.
తాజా క్రీడా వార్తల కోసం : https://www.vaartha.com/news/sports/