‘పుష్ప-2’లో రష్మిక లుక్ లీక్

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పుష్ప 2 సెట్ లోని రష్మిక లుక్ లీక్ అయ్యింది. పుష్ప భారీ విజయం సాధించడం తో పుష్ప 2 ఫై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో సెట్ తాలూకా పిక్స్ ఎప్పటికప్పుడు బయటకు లీక్ అవుతూ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచేస్తున్నాయి.

తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక లుక్ లీకైంది. శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఈ ఫొటోను ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయడమే లక్ష్యంగా షూటింగ్ జరుగుతోంది.