ఆఫీసులో ఉల్లాసంగా…

ఆఫీసులో పనిచేయడం అంటే ఎంతో బాధ్యతతో కూడినది. ఏకాగ్రత, నిరంతరం అప్రమత్తతతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి దానికి పైఅధికారులకు సంజాయిషీ చెప్పుకోవాల్సి ఉంటుంది. కొందరికి మనమంటే గిట్టదు. ఇంకొందరికి మనమంటే అభిమానం. మరికొందరు మనల్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తుంటారు. వీటన్నింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ పనిలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఉత్సాహంగా పనిచేసుకుంటూ పోవడమే ఉద్యోగి బాధ్యత.

కల్పన ఆఫీసుకు రాగానే అబ్బబ్బ ఇంటి కంటే ఆఫీసే వందరేట్లు నయం. కాస్త ఊపిరి తీసుకునే వీలుంటుంది అంటుంది. అందుకే ఆమె ఆఫీసులో ఉల్లాసంగా పనిచేస్తుంది. సహజది దీనికి భిన్నమైంది. ఆఫీసుకు ఎందుకొచ్చాను అనుకుంటూ, వచ్చినప్పటి నుంచి ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్లిపోవాలా అని ఉంటుంది.
పనిప్రదేశాల్లో నవ్వు- అనే విషయం మీద జరిపిన అధ్యయనాలు పనిగంటల్లో కనీసం పది నిమిషాలు హాస్యస్ఫోరక మాటలు, జోకులకు కేటాయించిన కంపెనీలు మంచి ఫలితాలను సాధించాయని చెబుతున్నాయి. పనిచేయకుండా అదేపనిగా నవ్వుతూ ఉండమని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదుకానీ, కాస్త నవ్వు, ఉత్సాహం, ఉల్లాసం కలుపుకుంటే మీ ఆఫీసుపని సజావుగా సాగుతుంది మరి-
్య పనికి సంబంధించిన ఏ విషయమయినా టీమ్‌లోని ప్రతి ఒక్కరితో చర్చించండి. వివరాలు అందరికీ తెలిసేలా చూడండి. ప్రతిరోజు పని ప్రారంభించే ముందు టీమ్‌లోని సభ్యులందరూ కూర్చుని ఆరోజు చేయాల్సిన పని గురించి చర్చించుకోండి.
్య ‘ఆడుతు,పాడుతు పనిచేస్తుంటే… అనే పాట వినే ఉంటారు. దానిని మీ పనిలోకి ఆహ్వానించండి. అదేపనిగా సీరియస్‌గా పనిచేస్తూపోతుంటే బుర్ర వేడెక్కిపోతుంది. అపుడపుడూ సందర్భాన్నిబట్టి హాస్యాన్ని ఆస్వాదించండి. పనిఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఎంత పనయినా అలవోకగా చేయగలుగుతారు.
్య నెలలో సాధించదలుచుకున్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు, సహోద్యోగి పుట్టినరోజు, పెళ్ళిరోజు … ఇలా ఏదో ఒక సందర్భాన్ని బట్టి అందరూ కలిసి వేడుక చేసుకోవడంవల్ల టీమ్‌లోని సభ్యుల మధ్య మంచి అనుబంధాలు పెరుగుతాయి. ఆ ప్రభావం చేసే పనిమీద పడి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
్య రోజుమొత్తం ఆశావహదక్పథంతో ఉండేలా అలవాటు చేసుకోండి. ఆందోళన పనిచేసే శక్తిని తగ్గిస్తుంది. పనివిషయంలో వచ్చే సమస్యలను తోటివారితో చర్చించి, సమస్యకు ఉన్న అన్ని కోణాలను పరిశీలించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.
్య తోటి ఉద్యోగస్తులకు, స్నేహితులకు సహాయం చేసే స్వభా వాన్ని పెంపొందించుకోండి. వారిని ఆందోళనకు గురిచేసే సందర్భా´లు, సమస్యలు వచ్చినపుడు మీరు కనీసం మాటసహాయం ద్వారానయినా కొంత ఉపశమనాన్ని ఇస్తున్నారన్న నమ్మకాన్ని వారికి కలిగేలా ప్రవర్తించండి.
్య ఉద్యోగజీవితానికి, కుటుంబజీవితానికి స్పష్టమయిన విభజన రేఖ గీసుకోండి. మీరు చేసే పనిని పూర్తిగా మీ సొంతవిషయంగా భావించి పూర్తి సమయాన్ని దానికే కేటా యించడం వల్ల కుటుంబజీవితం దెబ్బతినడమే కాకుండా, ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య మంచి సమన్వయాన్ని సాధించడానికి ప్రయత్నించండి.
్య బాగా ఒత్తిడితో గడిచిన రోజున పడుకునే ముందు చల్లటి నీటితో స్నానం చేసి, మంచి పుస్తకాన్ని చదువుతూ పడుకోండి. ఒక మంచి పుస్తకం మీ అలసటను పోగొట్టి మీ మెదడును చురుకుగా తయారుచేస్తుంది.
్య పనిలో పడి విషయాలను మరచిపోకుండా ప్రతిరోజు మీరు చేయాల్సిన పనుల వివరాలు రాసి మీ దష్టి తరచుగా పడే ప్రదేశంలో ఆ కాగితాన్ని అతికించండి.
అందులో రోజువారి కార్యక్రమాల వివరాలతో పాటు స్నేహితులతో సినిమాకు వెళ్లడం, పిల్లలను పార్కుకు తీసుకు వెడతానన్న విషయాలను కూడా చేర్చండి.
్య విమర్శలను స్వీకరించటం అలవాటు చేసుకోవాలి. లేదంటే అదేదో ఊహించని పరిణామంలా మానసిక అశాంతికి గురవుతారు. మీరు చేసేపనిలో ముందుకు దూసుకు పోవాలంటే భయాన్ని విడనాడాలి. అలాంటి భయాలు మీలో ఒత్తిడిని పెంచి చేస్తున్న పనిలో మీకు ప్రశాం తత, ఆనందం దక్క కుండా చేస్తాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/news/international-news/