ప్రేమంటే ఇదేనా?

Beautiful Lovely
Beautiful Lovely

మనదేశంలో ఆదర్శ ప్రేమికులు ఉన్నారు. ప్రేమ కోసం తమ ప్రాణాలను ఇచ్చినవారున్నారు. ప్రేమ భగ్నమైనా మరో వ్యక్తికి తమ జీవితంలో చోటు ఇవ్వకుండా, జీవితాంతం ఒంటరిగా జీవించి, ప్రేమకు జైకొడుతూ మరణించారు. వీరిని ప్రేమికులు ఆదర్శంగా తీసుకుంటు న్నారు. లైలా మజ్ను, దేవ దాసు వంటి సినిమాలను కూడా యువత ఆదర్శంగా తీసుకుంటుంది. ్తౖతమ ప్రేమ విఫల మైనప్పుడు మౌనంగా, గౌరవంగా తమనుతాము అంతం చేసుకుని, తమ ప్రేమ గొప్పదని, స్వచ్ఛమైందని, అమూల్య మైందని నిరూపించుకున్నారు. నిజమే అలాంటి ప్రేమలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రేమంటే మనసు ఏకమైపోవడం. శరీరం ఏకం కావడం కాదు. పెద్దలను ఒప్పించి, వివాహమాడి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇటీవల డేటింగ్‌ అనే పదం ఎక్కువగా వినిపిస్తున్నది. సినిమానటులు, క్రీడాకారులు వంటి సెలబ్రిటీస్‌తో డేటింగ్‌ అనే పదం మనదేశంలో వేగంగా పాకిందనే చెప్పొచ్చు. లిప్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌ అనండి. సహజీవనం అనండి. లివింగ్‌ టుగెదర్‌ అనండి. పేరేదైనా అనుబంధం ఒకటే. కానీ అందులో వివాహబంధం మాత్రం ఉండదు.
ఇందులో ముఖ్య భూమిక యువతరానిదేనని వేరే చెప్పాలా? ఈ అనుబంధంలో అన్నీ మామూలే. అతడు కూరగాయలు తరిగితే ఆమె వంట చేస్తుంది. ఆమె ఆఫీసుకెళ్తే అతను దిగబెడతాడు. ఆమెకు జబ్బు చేస్తే మందులిప్పించేది అతడే. అయినా వాళ్లు భార్యాభర్తలు కాదు. వాళ్ల ఇంటి పక్క వాళ్లకిది నచ్చకపోవచ్చు. అసలీ భావనకే ప్రజాదరణ లేకపోవచ్చు. అయినా ఈ సంబంధం చట్టవ్యతిరేకం మాత్రం కాదని తేలిపోయింది. ఈ సహజీవన సంబంధాలు కేవలం సినిమా స్టార్లు, ధనవంతులకే పరిమితం అనుకుంటే పొరపాటే. నగరాల్లో సైతం ఇలాంటి జంటలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ నవీన పోకడకి కారణాలేంటని ఒక్కసారి ఆరా తీయండి. పాశ్చాత్య ప్రభావం, నగరీకరణ, ఆర్థిక స్వాతంత్య్రం, ఇంటర్నేట్‌ ఇలా బోలెడు కనపడతాయి. వీటన్నింటింటే ప్రధాన కారణం మనుషుల మధ్య కనుమరుగవ్ఞతున్న అనుబంధాలు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలతో కళకళ లాడిన సమాజం ఇప్పుడు న్యూక్లియర్‌ ఫ్యాషన్‌తో నిండిపోయింది. నగరాల్లోని చాలామంది తల్లిదండ్రులకు యవ్వనంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారో గమనించే తీరిక కూడా ఉండటం లేదు. డాలర్ల వేటకోసం విదేశాలకెళ్లి అక్కడి సంస్కృతికి ఆకర్షితులవ్ఞతున్న వారి సంగతి సరేసరి. ఆర్థిక సంస్కరణల పుణ్యమాని సాఫ్ట్‌వేర్‌, హాస్పిటాలిటీ, విమానయాన రంగాలతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. యువతకు చిన్న వయసులోనే పెద్దమొత్తంలో వేతనాలు అందడంతో ఆర్థిక స్వాతంత్య్రం లభించింది. ఎమ్మెల్సీ, కార్పొరేట్‌ ఆఫీసుల్లో పనిచేసే యువతీ యువకులు రోజూ గంటలపాటు కలిసి పనిచేయడం ఇందుకు వూతమిస్తోందని మానసిక నిపుణులు అంటున్నారు. సహజీవనంతో ఒక్కటైనా కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలకే విడిపోతున్న సందర్భాలు కూడా లేకపోలేదని సైకాలజిస్ట్‌లు అంటున్నారు.
కొన్ని లాభాలున్నాయి…
సహజీవనాన్ని ఫాలో అయ్యేవారిని కదిపి చూస్తే బోలెడు కారణాలు చెబుతారు. ఆడ, మగ అనే తేడాలుండవ్ఞ. ఇద్దరికీ సమాన అవకాశాలు, స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చు. వ్యక్తిగత నిర్ణయాల్లో జోక్యం ఉండదు. తీవ్రమైన ఫెమినిస్ట్‌ భావాలున్న అమ్మాయిలకు ఇది చక్కగా సూటవ్ఞతుంది. ఇంటి పేరు మారదు. సమాజంలో బలంగా నాటుకుపోయిన కట్నం, గృహహింసలకు చోటుండదు.
నామాటే వినాలి అనే మొండితతానికి తావ్ఞండదు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ ఆలోచన లేదు. ఇద్దరి భావాలు మరీ తేడా అనిపించినప్పుడు, కలిసి ఒక భవిష్యత్తులో జీవించలేం అనుకున్నప్పుడు సింపుల్‌గా ఎవరి దారి వారిదే. దీనికోసం కోర్టుల చుట్టూ తిరిగి, డబ్బు, సమయం వృధా కాదు.
నష్టాలు ఉన్నాయి…
వివాహ బంధమంత పటిష్ఠత సహజీవనంలో ఉండదు. చిన్నచిన్న అభిప్రాయాల విభేదాలకే విడిపోవచ్చు. సహజీవనం చట్టబద్ధమైన జర్మనీ, అమెరికాలే ఇందుకు ఉదాహరణ. సమాజం, బంధువ్ఞల సాయం పొందలేరు. ఆర్థికంగా మంచి పరిస్థితి ఉన్నంతవరకే కొనసాగుతుంది. కేవలం శారీరక వాంఛలకే ఇది పరిమితం. ఈ జంటలకు పుట్టిన పిల్లలు సమాజంలో వివక్షకు గురవ్ఞతారు. ఇది కొనసాగితే కుటుంబ వ్యవస్థ బీటలువారే అవకాశముంది. ఏదీఏమైనా ఇందులో ఇబ్బంది పడేది మాత్రం అమ్మాయే. మగవారు సింపుల్‌గా ఏమైనా తప్పించుకోగలరు. కానీ ఆడవారు అన్నింటిని భరించాల్సిందే. కాబట్టి ఉద్యోగం చేసేవారైనా చేయనివారైనా అమ్మాయిలు సహజీవనం మన దేశ సంప్రదాయం కాదు, దానివల్ల వచ్చే నష్టాలకు బలైయ్యేది మాత్రం మీరేనని గ్రహించి, ఆకర్షించే ఆ ఊబిలో చిక్కుకోకండి.
ఇదెంత వరకు నిలుస్తుంది?
పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తూ, కోరికలు తీరిన తర్వాత ఇంకా వ్యామోహం ఉంటే లేదా ప్రేమ తమమధ్య ఇంకా బలంగా ఉందనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకోవాలను అనుకుంటున్నారు. లేకపోతే ఎవరి దారి వారిదే. కొందరు ఇలాంటి ఊబిలో నుంచి బయటపడి, త్వరగా కోలుకుంటారు. కానీ కొందరు అదే బాధతో తనువ్ఞ చాలించుకుంటున్నారు. ఏదిఏమైనా ప్రేమ గొప్పదే దాన్ని ఎవరూ కాదనరు. ప్రేమ పేరుతో కోరికల్ని తీర్చుకోవడం, తర్వాత వదిలేయడం, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలకు యువత ప్రత్యేకంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/