మంచి చికెన్ పచ్చడి

రుచి: వెరైటీ వంటకాలు

Chiken Pickle
Chiken Pickle

మొదట ముక్కలు కడిగి టిష్యూ పేపర్ పై ఉంచి ఆరనివ్వాలి.. సాధ్యమైనంత వరకు అన్ని ముక్కలూ ఒకే సైజులో ఉండేలా చేసుకోవాలి.. కొన్ని పెద్దవి, మరికొన్ని చిన్నవి తీసుకుంటే వేయించేటపుడు చిన్న ముక్కలు మరీ గట్టిగా అవుతాయి. లేదా మాడిపోతాయి . దీంతో పచ్చడి రుచి మారి పోతుంది … ముక్కలకు .. అల్లం, వెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు , కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి… నూనె బాగా కాగిన తర్వాత ముక్కలు వేసి వేయించాలి. అలాగే ముక్కలు వేశాక మంటను చిన్నగా పెట్టాలి.. ముక్క బయటి వైపు అంటా క్రిస్సీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లేకపోతే పచ్చడి పాడవుతుంది. చికెన్ ముక్కలు ఫ్రై చేసిన నూనెలోనే అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.

ఇపుడు మసాలా జత చేయాలి.. మసాలా దినుసులు వాడాలి .. కానీ గరం మసాలా పొడి వద్దు. యాలకులు, లవంగాలు , జీల కర్ర, దాల్చిన చెక్క, ఆవాలు , మెంతులను వేయించుకోవాలి.. కావాలనుకుంటే గసగసాలు వేసుకోవచ్చు.. పచ్చడి నుంచి నూనె పైకి తేలేటపుడు స్టవ్ ఆఫ్ చేయాలి.. చల్లారిన తర్వాత నిమ్మ రసం కలపాలి కారానికి బదులు , ఎండు మిర్చి వాడుకోవచ్చు. ఎండు మిర్చి తోపాటు మిరియాలు కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది.. నిమ్మ రసం బదులు ఆమ్ ఛూమ్ పిడిని వాడుకోవచ్చు..

చికెన్న్ ఫ్రై చేసే నూనెలో మొదట కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి.. నిల్వ పచ్చడి కాకుండా తక్కువ మోతాదులో అప్పటికపుడే కావాలనుకుంటే నూనెలో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. రిఫైన్డ్ ఆయిల్ కు బదులుగా నువ్వుల నూనె వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.