కృష్ణలంకలో ‘కృష్ణా’ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన

కృష్ణానది వరదల వల్ల కలిగే ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం

CM YS Jagan laid the foundation stone for the construction of 'Krishna' Retaining Wall in Krishnalanka
CM YS Jagan laid the foundation stone for the construction of ‘Krishna’ Retaining Wall in Krishnalanka

Vijayawada : కృష్ణలంకవాసులకు కృష్ణా నది వరదల వల్ల కలిగే ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది.. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. రూ. 125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. 2009లో కృష్ణా నదికి వరదలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజయవాడ వచ్చి ఫ్లడ్‌ రిటైనింగ్‌ వాల్‌ మంజూరు చేశారు. యనమలకుదురు నుంచి కోటినగర్‌ వరకు ఈ వాల్‌ నిర్మించారు.

దానికి కొనసాగింపుగా కరకట్ట (వారధి) నుంచి కోటినగర్‌ వరకు ఫ్ల్లడ్‌ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించనున్నారు. మంత్రులు వెల్లంపల్లి , కొడాలినాని, పేర్ని , పి.అనిల్ కుమార్ యాదవ్ , బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరిమున్నీసా, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్ , మొండితోక జగన్మోహనరావు, అబ్బాయి చౌదరి, కె.పార్థసారథి, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, సింహాద్రి రమేష్ ,మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మహిళా కార్పొరేషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం , విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గౌతమ్ రెడ్డి, కార్పోరేటర్ వెంకట సత్యనారాయణ, కలెక్టర్ ఏ. ఎండీ. ఇంతియాజ్, అధికారులు పాల్గొన్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/