ఏపీ సమాచార హక్కు కమిషనర్లుగా బాధ్యతల స్వీకారం

ప్రమాణం చేయించిన సీఎస్

CS giving appointment papers
CS giving appointment papers

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమీషన్ కమిషనర్లుగా ఉల్చల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ వీరితో ప్రమాణం చేయించారు. సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో ఇరువురు నూతన కమీషనర్లకు సీఎస్ పుష్పగుచ్చాలను అందించి ప్రభుత్వం తరుపున అభినందనులు తెలిపారు. సమాచార హక్కు చట్టం మరింత పటిష్టవంతంగా అమలు జరిగేలా కృషి చేయాలని సీఎస్ ఆకాంక్షించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/