ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తి ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట!

ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు

Criticisms of Vijay saireddy on Twitter
Criticisms of Vijay saireddy on Twitter

Amaravati:  వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకుండానే ఆయన సెటైర్లు వేశారు. ఇప్పుడు జరగబోయేది తిరుపతి లోక్ సభ స్థానం ఉపఎన్నిక అని… అలాంటప్పుడు కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్ వేయడం కాక మరేమిటని ఆయన ఎద్దేవా చేశారు.

సీఎం సీటును ఆఫర్ చేస్తున్న పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేదని, దాన్ని తీసుకునే కనీసం ఉనికి కూడా పార్టీకి లేదన్నారు. ‘జోగిజోగి రాసుకుంటే బూడిద రాలిందట… కనీసం ఎమ్మెల్యే కూడా కానివాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట’ అని అంటూ విజయసాయి సెటైర్ వేశారు..

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/