కరీంనగర్ లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తి నష్టమే కాకుండా..ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. తాజాగా కరీంనగర్ రాంనగర్ మార్క్ ఫడ్ గోదాముల ఏరియాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

గుజ్జుల వేణు అనే వ్యక్తికి చెందిన ప్లాస్టిక్ ఇండస్ట్రీలో షార్ట్ సర్కూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో మెషిన్లు పూర్తిగా దగ్ధం కావడం తో సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఫ్యాక్టరీ నుండి ఒక్కసారిగా పొగలు ఆకాశాన్ని తాకడంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఫైర్ వింగ్ అధికారులు ఇంజన్ తీసుకెళ్లి మంటలను ఆర్పారు .