జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం

తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, ఐటీడీపీ పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్‌ ఫై హత్యాయత్నం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికెళ్తున్న ఆయనపై గత అర్ధరాత్రి కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. కత్తులు, కర్రలతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కార్తీక్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

వైస్సార్సీపీ పార్టీ శ్రేణులే ఈ దాడికి పాల్పడ్డారని కార్తీక్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కార్తిక్ వైస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారనే కోపం తో తనను హతమార్చాలని ప్లాన్ చేసారు. కానీ తృటిలో కార్తీక్ తప్పించుకున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటన ఫై పోలీసులకు పిర్యాదు చేయగా..వారు దర్యాప్తు మొదలుపెట్టారు.