నూలు పోగు లేకుండా పాయల్ బోల్డ్ లుక్

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి – పాయల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘మంగళవారం’. ఈ చిత్రం తాలూకా పాయల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఒక్కసారిగా ఆసక్తి పెంచారు. ఈ మూవీ లో శైలజ పాత్రలో పాయల్ కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర బృందం తెలిపింది. ఈ లుక్ లో పాయల్ ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. అయితే, పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది.

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి డైరెక్టర్ గా అడుగుపెట్టిన అజయ్ భూపతి..ఇప్పుడు ఈ మంగళవారం మూవీ తో నిర్మాతగానూ మారారు. ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన అజయ్ భూపతి… ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ”గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో సినిమా తీస్తున్నాం. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు పాయల్ క్యారెక్టరైజేషన్ గుర్తు ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది” అని అజయ్ చెప్పుకొచ్చారు.