ఢిల్లీకి వెళ్లిన ఈటల, కోమటిరెడ్డి..అమిత్ షాతో భేటీ

తెలంగాణలో పార్టీ బలోపేతంపై మార్గనిర్దేశం చేయనున్న అమిత్ షా

etela-and-komatireddy-leaves-to-delhi

హైదరాబాద్‌: హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలో వీరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి ఓటమిపాలయినప్పటికీ బిజెపికి భారీ ఎత్తున ఓట్లు పడ్డాయి. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు 96,598 ఓట్లు రాగా… కోమటిరెడ్డకి 86,485 ఓట్లు వచ్చాయి. దీంతో, బిజెపి శ్రేణులు సంతోషంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి వీరికి అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే డీకే అరుణ ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బిజెపి శిక్షణా తరగతులు జగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులను సమాయత్నం చేసేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/