ఒత్తిడి నియంత్రణకు వ్యాయామం

ఆరోగ్యం-జాగ్రత్తలు

Exercise for stress control
Exercise for stress control

ఒత్తిడితో కూడుకున్న జీవనశైలిలో వ్యాయామం తప్పనిసరి. ఇలాంటప్పుడు అతిగా చేస్తే ఫలితం సంగతి ఎలా ఉన్నా ఇతర సమస్యలు ఎదురు కావచ్చు.

నిజానికి వ్యాయామం చేసేటప్పుడు చెమట మంచిదే. కానీ అదే చెమట విపరీతంగా వస్తే శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ను కోల్పోతారు.

ఫలితంగా డీహైడ్రేషన్‌ సమస్య ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు కేవలం మంచినీళ్లే కాకుండా కొబ్బరి నీళ్లు, చల్లని సూపులు తీసుకోవాలి.

వ్యాయామం అతి చేసినప్పుడు శరీరంలో నుంచి మినరల్స్‌ త్వరగా బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి నీరసం, అలసట వచ్చేస్తాయి.

వ్యాయామంతో పాటు తీసుకునే ఆహారం కూడా సమతులంగా ఉండాలి. ఖనిజాలు, లవణాలు, ఇతర పోషకాలు నిండిన పదార్థాలై ఉండాలి.

నడక, పరుగు ఎవరికి వారు చేయవచ్చు. అయితే ఏదైనా సమస్యలున్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి.

ఇక యోగా ఇతర వర్కవుట్లు చేసే ముందు నిపుణులతో మాట్లాడటం మంచిది. కనీసం ఆరునెలలు అయినా శిక్షకుల దగ్గర సాధన చేశాకే ఇవన్నీ సొంతంగా చేయడం మంచిది.

వ్యాయామం చేస్తున్నప్పుడు ఏ మాత్రం కండరాలు పట్టేసినట్లు ఉన్నా, తలనొప్పి బాధిస్తున్నా తేలిగ్గా తీసుకోకూడదు. కాసేపు విరామం తీసుకోవడం మంచిది. అవి పెరిగితే మొదటికే మోసం రావచ్చు.

కొందరు ఏ మాత్రం విరామం లేకుండా అదే పనిగా వ్యాయామాలు చేస్తుంటారు. దాని వల్ల శరీరం అలసిపోయి క్రమంగా వ్యాయామం చేయలేని పరిస్థితి ఎదరవుతుంది.

ఒక విడత అయ్యాక కనీసం రెండు నిమిషాలు విరామం తీసుకోవాలి. ఆ తరువాతే మళ్లీ మొదలు పెట్టాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/