బడిపిల్లలకు కోడిపిల్లలు

ఇంట్లో సెల్‌ఫోన్‌, ఆన్‌లైన్‌ గేమ్‌ల నుంచి దృష్టి మరల్చేలా..

బడిపిల్లలకు కోడిపిల్లలు
School Children

పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. ఆటలు ఆడిస్తారు. ఇంకా బాగా చదువుకోమంటూ కొంత హోంవర్క్‌ కూడా ఇస్తారు.

అంతేకానీ పిల్లలకు కోడిపిల్లల్ని ఇస్తారా ఎవరైనా? ఇండోనేషియాలోని ఆన్‌డుంగ్‌ ప్రభుత్వం మాత్రం ఇదే చేస్తోంది. ఆ కోడిపిల్లలతో విద్యార్థులు ఏం చేస్తారు అన్నదేగా మీ సందేహం!

పాఠశాల ముగిశాక విద్యార్థులు హోంవర్క్‌ చేయకుండా స్మార్ట్‌ఫోన్లకూ, ఆన్‌లైన్‌ గేమ్‌ షోలకూ అతుక్కుపోతున్నారని ఇక్కడి అధికారులు గుర్తించారు.

బడిపిల్లలకు కోడిపిల్లలు
Chicks

దీంతో విద్యార్థుల దృష్టిని స్మార్ట్‌ఫోన్లూ, ఆన్‌లైన్‌ గేమ్‌ షోల నుంచీ మరల్చడానికి గత నవంబరులో బాన్‌డుంగ్‌లోని పన్నెండు పాఠశాలల్లో రెండువేలమంది విద్యార్థులకు కోడిపిల్లలను అందజేశారు.

ఒక్కోవిద్యార్థికి ఒక్కోపిల్ల చొప్పున అందించిన అధికారులు..ప్రతిరోజూ వాటికి నీరూ, దాణా అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలనీ, హోంవర్క్‌ పూర్తయిన తర్వాత వాటితోనే ఆడుకోవాలనీ సూచించారు.

దాంతో విద్యార్థులు బడి నుంచి రాగానే ఎంతో ఉత్సాహంగా కోడిపిల్లల పెంపకం బాధ్యతల్ని చూసుకుంటున్నారట.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/